News September 16, 2024
ఎస్.కోట: మద్యం మత్తులో వ్యక్తి సజీవ దహనం
ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామంలో ఓ వృద్ధుడు ఆదివారం సజీవదహనమయ్యాడు. రాత్రి వినాయక నిమజ్జనంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెంట నాగు(74) మద్యం తాగి సిగరెట్ వెలిగించాడు. ఈ క్రమంలో సిగరెట్ నిప్పు అంటుకోవడంతో మంచంతో పాటు ఆయన సజీవ దహనమయ్యాడు. ఇంట్లో ఉన్న భార్య కేకలు వేసినా ఫలితం లేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 14, 2024
VZM: డ్రాలో ఎంపికయ్యే వారికి కీలక సూచనలు
మద్యం షాపులకు కలెక్టరేట్‌లో సోమవారం లాటరీ ప్రక్రియ జరగనున్న సంగతి తెలిసిందే. లాటరీలో ఎంపికయ్యే వారికి అబ్కారీ శాఖ సూపరిండెంటెండ్ శ్రీనాధుడు కీలక సూచనలు చేశారు. ఒక్కో షాపుకు ఒక్కో అభ్యర్థిని ఎంపిక చేస్తామని, వారితో పాటు మరో ఇద్దరు రిజర్వుడు అభ్యర్థులను కూడా ఎంపిక చేస్తామన్నారు. అసలు వ్యక్తి 24 గంటల్లోగా 6వ వంతు లైసెన్స్ ఫీ చెల్లించాల్సి ఉందని, లేకపోతే రిజర్వు అభ్యర్థులకు షాపులు కేటాయిస్తామన్నారు.
News October 13, 2024
VZM: మూడు స్లాట్లలో లాటరీ ప్రక్రియ
మూడు స్లాట్లలో మద్యం లాటరీ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8-10 గంటల వరకు మొదటి స్లాట్‌లో 50 షాపులు, ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 51 నుంచి 100 షాపుల వరకు(2వ స్లాట్), మధ్యాహ్నం 12 గంటల నుంచి 101 నుంచి 153 షాపుల వరకు(3వ స్లాట్)లో లాటరీ ప్రక్రియ జరగనుంది. లాటరీ ప్రక్రియ నిర్వహణ కోసం 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటర్‌లో ఒక తహశీల్దార్, ఎస్.హెచ్.ఓ ఉంటారు.
News October 13, 2024
పైడితల్లిమ్మ పండగ 2000 మందితో పటిష్ఠ బందోబస్తు
ఈ నెల 14,15,16, తేదీల్లో జరిగే పైడితల్లమ్మ పండగ తొలేళ్ళు, సిరిమానోత్సవానికి పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని ఆదివారం పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. సిరిమానోత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు 25 సెక్టర్లగా విభజించి 2000 మందితో రెండు షిఫ్టులో విధులకు కేటాయించినట్లు పేర్కొన్నారు. వనం గుడి వద్ద 3 షిఫ్టులుగా విధులలో ఉంటారన్నారు.