News October 22, 2024
ఎస్.కోట మీదుగా రోడ్డు నిర్మాణానికి రూ.956.21 కోట్లు మంజూరు
పెందుర్తి నుంచి శృంగవరపుకోట మీదుగా బౌడారా వరుకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 956.21 కోట్లు మంజూరు చేసిందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా రహదారిని నాలుగు లైన్లగా విస్తరిస్తామని చెప్పామని, భారతమాల పరియోజన పథకం కింద నిధులు విడుదలయ్యాయన్నారు. రహదారి నిర్మాణంతో ప్రయాణం సులభతరం అవుతుందని, పర్యాటక ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.
Similar News
News November 12, 2024
విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికకు మూడు నామినేషన్లు వ్యాలీడ్..!
విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ పత్రాల స్క్రూటినీ రిటర్నింగ్ అధికారి సేతు మాధవన్, ఎన్నికల పరిశీలకులు ఎం.ఎం.నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం ఆయన ఛాంబర్‌లో జరిగింది. స్క్రూటినీ అనంతరం ముగ్గురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఎటువంటి అభ్యంతరాలు లేనందున వ్యాలీడ్‌గా జేసీ ప్రకటించారు. అభ్యర్థుల వివరాలను నోటీస్ బోర్డ్‌లో పెడతామని JC తెలిపారు.
News November 12, 2024
విజయనగరం డీవీఈవోకి సీఎం చేతుల మీదుగా అవార్డు
విజయనగరం జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న భీమ శంకర్రావుకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. సోమవారం విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ప్రిన్సిపల్ క్యాడర్లో ఈ అవార్డు పొందినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి. అవార్డు పొందిన డీవీఈవోను పలువురు ప్రిన్సిపల్స్, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల అధ్యాపకులు అభినందించారు.
News November 12, 2024
విజయనగరం: మూడు జిల్లాలకు ఒక్కరే..!
వైద్య సేవ జిల్లా సమన్వయకర్త పోస్టు ఖాళీగా ఉండి నెలరోజులు గడుస్తుంది. విజయనగరం,విశాఖపట్నం,పార్వతీపురం జిల్లాలకు అప్పారావు ఒక్కరే సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. మూడు జిల్లాల బాధ్యతలు చూడడం అనేది ఏ అధికారికైనా కత్తి మీద సాము వంటిదే.వైద్య సేవ ఆసుపత్రుల పరిశీలన, సేవల తీరుపై ఆరా తీయడం, సకాలంలో వైద్యం అందేలా చూడాలి. జిల్లాకు సమన్వయకర్తను నియమిస్తే సకాలంలో వైద్యసేవలు అందుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.