News May 4, 2024

ఎస్ పేట వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

ఎస్ పేట సమీపాన హసనాపురం రోడ్డుపై శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బైకులు ఢీకొని సంగం మండలం తెర మన గ్రామానికి చెందిన తుమ్మల శివ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహేశ్‌ను 108 వాహనంలో ఆత్మకూరు ఆసుపత్రి చికిత్స కోసం తరలించారు.

Similar News

News October 16, 2025

కూతురిపై అత్యాచారం.. తండ్రికి జీవిత ఖైదు

image

కూతురిపై తాగిన మైకంలో అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రికి కోర్టు జీవిత ఖైదు విధించింది. జలదంకి మండలానికి చెందిన బాలరాజు 2019 జూన్ 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిపై అత్యాచారం చేశారు. ఆమెకు గర్భం రావడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

News October 16, 2025

నెల్లూరు: నెల రోజులు ఇండస్ట్రీ పార్ట్నర్ షిప్ డ్రైవ్

image

నెల్లూరు జిల్లాలో బుధవారం నుంచి నెల రోజులు APIICఆధ్వర్యంలో ఇండస్ట్రీ పార్టనర్ షిప్ డ్రైవ్ నిర్వహిస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కందుకూరు సబ్ కలెక్టరేట్‌లో సంబంధిత వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. స్థానిక పరిశ్రమల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల సృష్టే లక్ష్యంగా డ్రైవ్ జరుగుతుందన్నారు.

News October 16, 2025

నుడా వీసీగా వెంకటేశ్వర్లు

image

నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) వైస్ ఛైర్మన్(వీసీ)గా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నుడా పరిధిలో పదుల సంఖ్యలో లేఅవుట్లకు అనుమతులు ఆగిపోయాయి. వీసీ నియామకంతో వీటికి మోక్షం లభించే అవకాశముంది.