News February 26, 2025
ఎస్.రాయవరంలో శివరాత్రి రోజున విషాదం

ఎస్.రాయవరం మండలం పెనుగొల్లులో శివరాత్రి రోజున విషాదం నెలకొంది. శివరాత్రి సందర్భంగా బుధవారం పెనుగొల్లు గ్రామంలో పక్కుర్తి చరణ్ (20) మరో యువకుడు స్నానానికి దిగారు. వీరికి ఈత రాకపోవడంతో మునిగిపోతుండగా ఒక యువకుడిని రక్షించారు. అప్పటికే మునిగిపోయిన చరణ్ను బయటికి తీయగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హుటాహుటిన నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Similar News
News October 29, 2025
15వేల విద్యుత్ స్తంభాలు సిద్ధం: సీఎండీ

విశాఖ ఏపీఈపీడీసీఎల్ పరిధిలో గల 11 జిల్లాల్లో 15 వేల విద్యుత్ స్తంభాలు, 950 ట్రాన్స్ఫార్మర్లు, 80 జేసీబీలు, 115 క్రేన్లు, 254 డ్రిల్లింగ్ యంత్రాలు సిద్ధం చేసినట్లు సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పునరుద్ధరణ చర్యలు పూర్తయ్యే వరకు ఉద్యోగుల సెలవులను రద్దు చేశామన్నారు.
News October 29, 2025
సంగారెడ్డి: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ

సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో 30 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని డైరెక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 19 నుంచి 45 వయసు గల పురుష అభ్యర్థులు అర్హులు. 10 క్లాస్ పాసై, తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. శిక్షణ సమయంలో వసతి భోజనం ఉచితంగా ఇస్తామన్నారు.
News October 29, 2025
అంగన్వాడీల్లో 14వేల పోస్టులు.. మంత్రి కీలక ఆదేశాలు

TG: అంగన్వాడీల్లో 14K పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఏజెన్సీలో STలకు 100% కోటాపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేతకు వెకేట్ పిటిషన్ వేయాలన్నారు. KA, AP, ఛత్తీస్గఢ్లో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్గా పరిగణించకపోవడంతో 50% రిజర్వేషన్ రూల్ వర్తించట్లేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఇక్కడా అదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.


