News December 25, 2024

ఎస్.రాయవరం: పేకాట ఆడుతూ పట్టుబడిన మహిళలు

image

ఎస్.రాయవరం మండలం సీతారాంపురంలో పేకాట శిబిరంపై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండడం విశేషం. ఎస్ఐ విభీషణరావు ఆధ్వర్యంలో మహిళ కానిస్టేబుల్‌తో కలిసి నిర్వహించిన దాడుల్లో రూ.67 వేల నగదు, 10 మొబైల్ ఫోన్లు, ఏడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 20, 2025

ఆనందపురం: లంకె బిందెల పేరుతో రూ.28 లక్షలు స్వాహా

image

ఆనందపురం మండలం బీపీ కళ్లాలకు చెందిన నలుగురు వద్ద నుంచి లంకె బిందెలు పేరుతో ముగ్గురు వ్యక్తులు రూ.28 లక్షలు కాజేశారు. దీనిపై ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. తన దగ్గర బంగారు నిధి ఉందని పూజలు చేయడానికి రూ.30 లక్షలు అవుతుందని నకిలీ స్వామీజీ నమ్మించాడు. బాధితులు దఫదఫాలుగా నిందితులకు రూ.28 లక్షలు ఇచ్చారు. ఈనెల 2న బాధితులకు రెండు బిందెలు ఇచ్చి వారు వెళ్లిపోయారు. తర్వాత చూడగా వాటిలో ఏమి లేవు.

News January 20, 2025

ఎండాడలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

ఎండాడ సాయిరాం పనోరమ హిల్స్ వద్ద నూతనంగా నిర్మాణంలో ఉన్న భవంతులలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అనారోగ్యంగా ఉండి మద్యం తాగి మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.

News January 19, 2025

విశాఖ: రూ.1,586.08కోట్ల బడ్జెట్‌కు ఆమోదం

image

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26) రూ.1,586.08 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌కు విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఈ సమావేశం శనివారం జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరిగింది. బడ్జెట్‌లో ఆదాయం రూ.1589.13, వ్యయం రూ.1586.08 కోట్లుగా చూపించారు. త్వరలో దీనిని ప్రభుత్వ ఆమోదానికి పంపుతామని జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు.