News March 6, 2025
ఎస్.రాయవరం: యువకుల ప్రాణం తీసిన అతివేగం..!

రైల్వే న్యూకాలనీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో తిక్కవానిపాలేనికి చెందిన వాసుపల్లి గోపి కుమారుడు యశ్వంత్(21), గొడుగు అచ్చిరాజు కొడుకు సాయికుమార్(20) <<15656341>>మృతి చెందారు<<>>. యశ్వంత్ కుటుంబం బతుకుతెరువు కోసం ఎస్.రాయవరం నుంచి నగరానికి వలస వచ్చారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బైక్ 120 స్పీడ్‌లో నడిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Similar News
News March 6, 2025
బ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలి: జగన్

కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేయాలని YCP MPలకు జగన్ సూచించారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై పార్లమెంటులో చర్చ జరిగే అవకాశమున్న నేపథ్యంలో వారికి సూచనలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మొదట్లో EVMలతో నిర్వహించిన దేశాలు కూడా తర్వాత బ్యాలెట్ విధానానికి మళ్లాయని గుర్తు చేశారు.
News March 6, 2025
ఇవాళ వే2న్యూస్‌లో ఈ స్టోరీలు చదివారా..?

– కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ ఎపిసోడ్
– బాబర్ ఆజమ్‌పై విమర్శలు.. తండ్రి ఆగ్రహం
– YS జగన్‌పై పోలీసులకు ఫిర్యాదు
– సింగర్‌తో BJP MP పెళ్లి.. ఫొటోలు
– ఎగ్జామ్ సిస్టమ్‌ను ఎవరు తయారు చేశారంటే..
– రిటైర్మెంట్‌పై చంద్రబాబు ఏమన్నారంటే
– తమన్నా బ్రేకప్.. కారణమిదే
– తిరుమల అన్న ప్రసాదంలో కొత్తగా..
– ఛాంపియన్స్ ట్రోఫీ: ఈ సారి ఈ పరంపర వద్దు
News March 6, 2025
అల్లూరి: వాట్సప్ నుంచి SSC హాల్ టికెట్లు

పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు హాల్ టికెట్లను వాట్సాప్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చని అల్లూరి జిల్లా DEO బ్రహ్మాజీరావు తెలిపారు. మొదట https://www.bse.ap.gov.in పై క్లిక్ చేసి, తరువాత హోమ్ పేజీలో ssc public exam-2025 హాల్ టికెట్ లింక్‌ను క్లిక్ చేయాలన్నారు. రెగ్యులర్ /ప్రైవేట్/ఒకేషనల్‌పై క్లిక్ చేసి జిల్లా, స్కూల్, విద్యార్థి పేరు, DOB తదితర వివరాలను నమోదు చేసి హాల్ టికెట్ పొందవచ్చు అన్నారు.