News March 6, 2025

ఎస్.రాయవరం: యువకుల ప్రాణం తీసిన అతివేగం..!

image

రైల్వే న్యూకాలనీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో తిక్కవానిపాలేనికి చెందిన వాసుపల్లి గోపి కుమారుడు యశ్వంత్(21), గొడుగు అచ్చిరాజు కొడుకు సాయికుమార్(20) <<15656341>>మృతి చెందారు<<>>. యశ్వంత్ కుటుంబం బతుకుతెరువు కోసం ఎస్.రాయవరం నుంచి నగరానికి వలస వచ్చారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బైక్ 120 స్పీడ్‌లో నడిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Similar News

News March 26, 2025

బెడ్‌రూమ్‌లో ఏ కలర్ లైట్ మంచిది?

image

రాత్రి నిద్రపోయే సమయంలో బెడ్‌రూమ్‌లో ఎరుపు రంగు లైట్ వేసుకుంటే చక్కగా నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ తక్కువ వెలుతురు వచ్చే బల్బును ఎంపిక చేసుకొంటే మంచిది. దీంతో మెదడులో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యి నిద్ర నాణ్యత పెరుగుతుంది. అలాగే ఇష్టాలను బట్టి పసుపు, నారింజ/కాషాయం రంగులూ మంచి నిద్రకు సహకరిస్తాయి. మరోవైపు తెలుపు, నీలం రంగులు బెడ్‌రూమ్‌లో అస్సలు వాడకూడదని చెబుతున్నారు.

News March 26, 2025

ఇఫ్తార్ విందుకు ఈసీ నో

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో నిర్వహించదలచిన ఇఫ్తార్ విందుకు ఎన్నికల సంఘం అనుమతివ్వలేదు. ఈ కార్యక్రమంలో సీఎం, ఇతర నేతలు పాల్గొంటారని పర్మిషన్ ఇవ్వాలని లేఖ రాయగా ఈసీ తిరస్కరించింది. హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది.

News March 26, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

❤MBNR: రేపు PUలో ఉగాది వేడుకలు
❤గద్వాల డిపో మేనేజర్‌కు సన్మానం
❤కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
❤ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల చలివేంద్రం
❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు
❤నాగర్‌కర్నూల్‌లో క్షుద్ర పూజల కలకలం
❤మార్చి 31 వరకు పన్నులు చెల్లించండి:కలెక్టర్లు
❤ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్లు
❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

error: Content is protected !!