News March 12, 2025

ఎస్.రాయవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పెనుగొల్లు గ్రామానికి చెందిన చందాక రాము (58) అడ్డరోడ్డు గ్రామం నుంచి స్వగ్రామం వెళ్లేందుకు బైక్ పై యూటర్న్ తీసుకుంటుండగా అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాము అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News November 19, 2025

NGKL: మంత్రాలయానికి బస్సు.. ఫోన్ చేయండి!

image

కార్తీక బహుళ అమావాస్య పురస్కరించుకుని NGKL డిపో నుంచి డిలక్స్ బస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య ‘Way2News’తో తెలిపారు. ఈనెల 20న NGKL నుంచి మధ్యాహ్నం బయలుదేరి, మంత్రాలయం(రాఘవేంద్ర స్వామి), పంచముఖి ఆలయం దర్శనం, ఆంజనేయ స్వామి ఆలయంలో బస ఉదయం పంచముఖి నుంచి బయలుదేరి జోగులాంబ అమ్మవారి దర్శనం అనంతరం తిరిగి ప్రయాణం అన్నారు. ఛార్జీ రూ.1000. వివరాలకు 94904 11591, 94904 11590కు ఫోన్ చేయాలన్నారు.

News November 19, 2025

9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు

image

AP: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9.2 కేజీల బంగారంతో తయారు చేసిన సత్యసాయి విగ్రహాన్ని వెండి రథంలో పట్టణంలో ఊరేగించారు. భక్తజన సంద్రమైన ప్రశాంతి నిలయంలో ‘సురంజలి’ పేరుతో సంగీత కార్యక్రమం జరిగింది. నేడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ తదితర ప్రముఖులు జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.

News November 19, 2025

తిరుపతి రైతులకు నేడు నగదు జమ

image

తిరుపతి జిల్లా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నగదు ఇవాళ విడుదల కానుంది. జిల్లాలోని 1,54, 908 మంది రైతులకు రూ.104 కోట్లు బుధవారం జమ చేయనున్నారు. కడప జిల్లా నుంచి సీఎం చంద్రబాబు నగదు విడుదల చేస్తారు. తిరుపతి జిల్లాలో ప్రస్తుతం వరినాట్లు మొదలయ్యాయి. వీరికి ఈ నగదు ఎంతగానో ఉపయోగపడనుంది.