News March 12, 2025

ఎస్.రాయవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పెనుగొల్లు గ్రామానికి చెందిన చందాక రాము (58) అడ్డరోడ్డు గ్రామం నుంచి స్వగ్రామం వెళ్లేందుకు బైక్ పై యూటర్న్ తీసుకుంటుండగా అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాము అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News February 8, 2026

నేడు ఈ పనులు చేయకండి!

image

ఈరోజు భాను సప్తమి. ఆదిత్యుడిని పూజించే పవిత్రమైన రోజు! ఇంతటి శుభదినానికి గౌరవమిస్తూ కొన్ని నియమాలు పాటించడం మంచిది. ‘మద్యానికి దూరంగా ఉండాలి. మాంసం ముట్టరాదు. ఒంటికి, తలకు నూనె పెట్టుకోరాదు. ఉల్లి, వెల్లుల్లి తినరాదు. బ్రహ్మచర్యం పాటించాలి’ అని సూర్యాష్టకంలో ఉంది. లేకపోతే 7 జన్మల పాటు రోగాలు, దరిద్రంతో బాధ పడతారని పండితులు చెబుతున్నారు. శుభ ఫలితాలకై నేడు ఏం చేయాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.

News February 8, 2026

కాకినాడ: ఊరెళితే.. దోచేశారు..!

image

గొల్లప్రోలు మండలం దుర్గాడలో భారీ చోరీ జరిగింది. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వెలుగుల భాస్కరరావు కుటుంబం పుణే వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆ సమాచారం తెలుసుకొని, వారి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని 50 గ్రాముల బంగారం, రెండున్నర కేజీల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం గమనించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 8, 2026

జీడిమామిడిలో ఆకు, పూత, కాయమచ్చ తెగులు నివారణ

image

ఈ తెగులు వల్ల జీడిమామిడి చెట్టు ఆకులపై చిన్న, చిన్న లేత ఆకుపచ్చ మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి పెరుగుతూ మచ్చ మధ్య ఎండిపోతుంది. చివరికి మొత్తం ఆకు ఎండి రాలిపోతుంది. పూత కాడలపై మచ్చలు వచ్చి పూత ఎండిపోయి రాలిపోతుంది. ఈ తెగులు నివారణకు రైతులు తొలుత తెగులు ఆశించిన కొమ్మలను తొలగించాలి. లీటరు నీటికి మ్యాంకోజెబ్ 1 గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 1ml కలిపి పిచికారీ చేసుకోవాలి.