News October 27, 2024
ఎస్.రాయవరం సముద్ర తీరంలో విజయనగరం విద్యార్థులు గల్లంతు

ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు విద్యార్థులు గల్లంతయినట్లు మెరైన్ ఏఎస్ఐ కృష్ణ తెలిపారు. కోరుప్రోలు గ్రామానికి వివాహ వేడుకలో పాల్గొనేందుకు విజయనగరం నుంచి వచ్చిన 11 మంది విద్యార్థులు తీరంలో విహారయాత్రకు వెళ్లారు. వారిలో టి.అర్జున్, బి.బబ్లు సముద్రంలో స్నానం చేస్తుండగా గల్లంతయినట్లు పేర్కొన్నారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Similar News
News October 18, 2025
VZM: బాల సంరక్షణ కేంద్రాలకు ధ్రువపత్రాల పంపిణీ

బాలల సరంక్షణా కేంద్రాలకు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం ధృవప్రతాలను పంపిణీ చేశారు. జిల్లాలోని మూడు బాల సదనాలు, ఒక చిల్డ్రన్ హోమ్, ఒక శిశుగృహ హోమ్, 4 చైల్డ్ కేర్ ఎన్జిఓ హోమ్స్ కు ఫైనల్ సర్టిఫికెట్స్ అందజేశారు. జిల్లాలోని శిశు సంరక్షణ సంస్థలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడానికి ఈ జిల్లా స్థాయి తనిఖీ కమిటీ పనిచేస్తుందని ఆయన తెలిపారు.
News October 17, 2025
పుణ్యక్షేత్రాలకు విజయనగరం నుంచి ప్రత్యేక బస్సులు

కార్తీక మాసంలో భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామాల దర్శనానికి అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో బస్సులు నడుస్తాయని, సూపర్ లగ్జరీ రూ.2000, అల్ట్రా డీలక్స్ రూ.1950గా చార్జీలు నిర్ణయించామన్నారు. టిక్కెట్లు www.apsrtconline.in లేదా సమీప డిపోలో లభ్యమన్నారు.
News October 17, 2025
విజయనగరం ఎంప్లాయిస్ గ్రీవెన్స్కు 27 ఫిర్యాదులు

కలెక్టరేట్లో ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎంప్లాయిస్ గ్రీవెన్స్లో 27 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. ట్రెజరీ, డ్వామా, ఈపీడీసీఎల్, మెడికల్ విభాగాలకు చెందిన ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. గత శుక్రవారం అందిన 40 ఫిర్యాదుల్లో చాలావరకు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.