News July 11, 2024
ఎస్.రాయవరం: సీఎం పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 11న ఎస్.రాయవరం మండలం దార్లపూడిలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని తెలిపారు. దార్లపూడిలో సీఎం భద్రతా ఏర్పాట్లపై అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ మురళీకృష్ణతో సమీక్షించారు. భద్రత ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించవద్దని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.
Similar News
News February 18, 2025
విశాఖ: టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య

టెన్త్ క్లాస్ చదువుతున్న కే.సాస మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. అక్కయ్యపాలెం ఎన్. జి.జి..ఓఎస్.కాలనీ ఓ అపార్ట్మెంట్‌లో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది. బాలిక సీతమ్మధారలోని ఓ స్కూల్‌లో చదువుతుంది. ఏమైందో తెలియదు గానీ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 18, 2025
బహుళ పంటల విధానంపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలి: కలెక్టర్

లాభదాయక సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకృతి సేద్యానికి, మిల్లెట్లు, బహుళ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామాలల్లో ప్రతి ఇంటి వద్దా కంపోస్ట్ పిట్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల పెంపకం చేసేలా అవగాహన కల్పించాలన్నారు.
News February 18, 2025
గాజువాక: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

గాజువాక షీలా నగర్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మైలపల్లి మనోహర్ బైక్‌ను నడుపుతుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతని తండ్రి పేరు దేముడు అని ఐడి కార్డులో రాసి ఉంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.