News May 24, 2024

ఏఆర్ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం.. మూడేళ్ల జైలు

image

ఏఆర్ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం కేసులో పవన్, సత్య భవానీశంకరానికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.500 ఫైన్ విధిస్తూ కాకినాడ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి విజయబాబు గురువారం తీర్పునిచ్చారు. 2020లో కొండయ్యపాలానికి చెందిన సుబ్రహ్మణ్యం, పవన్, సత్య భవానీశంకరం అదే ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ బాలారెడ్డిపై చాక్‌తో దాడి చేశారు. టూ టౌన్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేశారు. మూడో నిందితుడు సుబ్రహ్మణ్యం మృతి చెందాడు.

Similar News

News October 28, 2025

తూ.గో: పునరావాస కేంద్రాలకు 361 కుటుంబాల తరలింపు

image

తుఫాను నేపథ్యంలో తూ.గో జిల్లా వ్యాప్తంగా 361 కుటుంబాలు, 1193 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న మండలాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు. శిబిరాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

News October 28, 2025

తూ.గో జిల్లా స్కూళ్లకు రేపు సెలవు

image

తుఫాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని స్కూళ్లకు బుధవారం కూడా సెలవు ఇచ్చామని డీఈవో కె.వాసుదేవరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా స్టడీ క్లాసులు, అదనపు తరగతుల పేరుతో పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 28, 2025

రాజమండ్రి: BSNL వినియోగదారులకు గమనిక

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో BSNL నెట్వర్క్ సక్రమంగా పనిచేసేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు ఓ ప్రకటనలో తెలిపారు. అవసరమైన చోట్ల మొబైల్ జనరేటర్లు, ఏడు డివిజన్లలో ఏడు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ సమయంలో నెట్వర్క్ ఇబ్బందులు తలెత్తితే వినియోగదారులు 0883-2472200కు కాల్ చేయాలని కోరారు.