News July 25, 2024
ఏఎన్యూ డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాల విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఏప్రిల్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల 2వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ గంగాధరరావు విడుదల చేశారు. ఈ పరీక్షలకు 9792 మంది హాజరు కాగా వారిలో 5670 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. అదనపు పరీక్షల నియంత్రణ అధికారి రెడ్డి ప్రకాష్ రావు మాట్లాడుతూ.. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.inలో పొందుపరిచినట్లు చెప్పారు.
Similar News
News December 13, 2025
మంగళగిరి: ఆ అధికారి ఆఫీసుకు వచ్చి ఏడాది దాటింది!

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (మంగళగిరి) కార్యాలయం సబార్డినేటర్ మహ్మద్ ఫజల్-ఉర్-రహమాన్ విధులకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో సహాయ సంచాలకులు సీరియస్ అయ్యారు. గతేడాది జూన్ నుంచి నేటి వరకు ఎటువంటి అనుమతి లేకున్నప్పటికీ విధులకు హాజరు కావడం లేదని చెప్పారు. ఇప్పటి వరకు 3 సార్లు నోటీసులు జారీచేసినప్పటికీ స్పందించలేదన్నారు. 15 రోజుల లోపులిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని, లేకుంటే సర్వీస్ నుంచి తొలగిస్తామన్నారు.
News December 13, 2025
నేడు తుళ్లూరులో ఎంపీ పెమ్మసాని పర్యటన

తుళ్లూరు మండలంలో శనివారం కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో అమరావతి అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తుళ్లూరులోని మేరీమాత స్కూల్లో “నయీ చేతన” కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.
News December 12, 2025
కాకుమాను: సివిల్ సప్లైస్ డైరెక్టర్గా నక్కల ఆగస్టీన్

కాకుమాను మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత నక్కల ఆగస్టీన్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు ఆగస్టీన్ ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టీన్ నియామకంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.


