News October 26, 2024

ఏఐసీసీ జనరల్ సెక్రటరీని కలిసిన డిప్యూటీ సీఎం

image

ఖమ్మం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు, కులగణనను తెలంగాణ నుంచే ప్రారంభిస్తామన్న హామీని అమలులోకి తేవడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేసీ వేణుగోపాల్‌ కి భట్టి వివరించారు.

Similar News

News November 11, 2024

KMM: ప్రేమ పేరుతో మోసం.. MLA వద్దకు యువతి

image

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని గార్ల మండలంలోని పెద్ద కిష్టాపురంకి చెందిన భూక్య సంగీత సోమవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను వేడుకుంది. ముల్కనూరులో సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన MLAను కలిసి వినతి పత్రం అందజేసింది. పెద్దకిష్టాపురానికి చెందిన శ్రీకాంత్ తనను మోసం చేసినట్లు పేర్కొంది. ఈ విషయమై PSలో ఫిర్యాదు చేశానని, న్యాయం చేయాలని MLAని కోరింది.

News November 11, 2024

ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా కుటుంబ సర్వే

image

ఖమ్మం జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 5,71,240 లక్షల ఇళ్లు ఉండగా ఆదివారం నాటికి 30,616 ఇళ్లు మాత్రమే సర్వే చేశారు. జిల్లాలో 4,118 బ్లాక్‌లుగా విభజించగా ప్రస్తుతం 3,150 బ్లాక్‌లలో సర్వే జరుగుతుంది. 75 ప్రశ్నలతో కూడిన ఫామ్‌ను నింపడానికి దాదాపు 30 నిమిషాలు పడుతున్నట్లు తెలుస్తొంది.

News November 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు ∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం