News June 27, 2024

ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు

image

పుట్టుకతోనే అంధురాలు.. కానీ 6ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది నల్గొండకి చెందిన పాలబిందెల శ్రీపూజిత. చదువు పూర్తి చేసి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. 2022లో తొలి ప్రయత్నంలోనే నల్గొండ జిల్లా కోర్టులో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందింది. ఆ ఉద్యోగం చేస్తూనే.. గురుకుల లెక్చరర్‌ పరీక్షలకు సిద్ధమైంది. ఏప్రిల్‌లో వెల్లడైన గురుకుల ఫలితాల్లో ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించింది.

Similar News

News February 13, 2025

నల్గొండ: ఎన్నికల బరిలో 22 మంది!

image

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నామినేషన్‌ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల బరిలో 22 అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 10వ తేదీతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్‌ల పర్వం ముగిసింది. ఈనెల 11న నామినేషన్ల పరిశీలనలో 23అభ్యర్థులకు గాను ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో 13న నామినేషన్ల ఉపసంహరణ పర్వం సైతం ముగిసింది.

News February 13, 2025

మర్రిగూడ: బైక్‌ను ఢీకొన్న మినీ వ్యాన్

image

మర్రిగూడ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి రహదారి‌పై రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌ను మినీ కూరగాయల వ్యాన్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 13, 2025

NLG: పెద్దగట్టు జాతరకు సెలవు ప్రకటించాలని వినతి

image

సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు శ్రీ లింగమంతులస్వామి వారి జాతర సందర్భంగా సోమవారం జిల్లాలోని విద్యాసంస్థలు, కార్యాలయాలకు ఒకరోజు సెలవు ప్రకటించాలని యాదవ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, నేతలతో కలిసి జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని వారు కోరారు.

error: Content is protected !!