News December 30, 2024
ఏకసభ్య కమిషన్‌కు అభిప్రాయాలు తెలపవచ్చు: కలెక్టర్
షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ పై విచారణకు శ్రీరాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన ఏక సభ్యకమిషన్ సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాలుకు వస్తుందని కలెక్టర్ నాగలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యహ్నం 2 గంటల వరకు కమిషన్ సభ్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు. షెడ్యూల్ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు తమ అభిప్రాయాలను కమిషన్ సభ్యులకు తెలియజేయవచ్చని అన్నారు.
Similar News
News January 22, 2025
ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసిన గుంటూరు ఎస్పీ
పోలీస్ సర్వీస్ నియమాలకు విరుద్ధంగా నగదు అప్పు తీసుకుని చెల్లించని ఘటనల్లో ముగ్గురు పోలీస్ సిబ్బందిని ఎస్పీ సతీశ్ కుమార్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండైన వారిలో ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఒక హోంగార్డు ఉన్నారు. వీరు ముగ్గురు ఏపీ కో-ఆపరేటివ్ సొసైటీస్ నియమాలు-1964 లోని మూడవ నిబంధన ఉల్లంఘించారని, ఈ మేరకు సస్పెండ్ చేసినట్లు ఎస్సీ తెలిపారు.
News January 22, 2025
మాచవరం: ఆమెపై లైంగిక దాడికి మరో మహిళ సహాయం
మాచవరంలో మహిళపై లైంగిక దాడికి సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ మంగళవారం తెలిపారు. ఎస్సై కథనం.. మాచవరానికి చెందిన మహిళ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో స్నేహం ఉండేది. ఇటీవల ఆమెకు వేరే వ్యక్తితో వివాహం కుదిరింది. ఈ క్రమంలో స్నేహితునితో కలిసి దిగిన ఫొటోలను ఇవ్వాలంటూ అడిగింది. ఫొటోలు ఇస్తానని తెలంగాణకు తీసుకొచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. అతనికి సహకరించిన మరో మహిళపై కేసు నమోదైంది.
News January 22, 2025
అధికారులకు గుంటూరు కలెక్టర్ సూచనలు
తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆక్రమిత ప్రాంతాల్లోని నివాసాలను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా రెగ్యులరైజేషన్ చేయడానికి సంబంధిత శాఖలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, రైల్వే, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేలో 16,025 నివాసాలు గుర్తించామన్నారు.