News May 12, 2024

ఏజెన్సీలో 4 గంటల వరకే పోలింగ్: కలెక్టర్ ప్రియాంక అల

image

ఏజెన్సీలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు అధికంగా ఏజెన్సీలో ఉండటంతో ఇక్కడ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4 తర్వాత ఓటర్లను లోనికి అనుమతించమన్నారు.

Similar News

News February 17, 2025

ఖమ్మం నుంచి పెద్దగట్టు జాతరకు బస్సులు

image

 సూర్యాపేట పెద్దగట్టు జాతర నిన్నటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ జాతర  ఐదు రోజులపాటు కొనసాగునుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి పెద్దగట్టు జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఖమ్మం డిపో మేనేజర్ దినేష్ కుమార్ తెలిపారు. భక్తులు ప్రయాణం సౌకర్యార్థం ఈ జాతరకు బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు. 

News February 17, 2025

ప్రేమతో ఏది పెట్టినా పరమాన్నమే: మంత్రి

image

KMM: ప్రేమతో ఏది పెట్టినా అది పరమాన్నమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం రఘునాథపాలెం (M) పుటనితండాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. జొన్న రొట్టె, కొరివి పచ్చడి అంటే నాకు ఎంతో ఇష్టమని మంత్రి చెప్పారు. కాగా మంత్రి జొన్నరొట్టెలు తింటూ కాసేపు అక్కడి కాంగ్రెస్ నాయకులతో సరదాగా ముచ్చటించారు.

News February 16, 2025

భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక మండలం దుగినేపల్లి గ్రామం చెగర్శల సరిహద్దు వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు గుంతను తప్పించబోయి కిందపడ్డారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాటూరి హనుమంతరావు, మునిగెల నాగేశ్వరరావుగా స్థానికులు గుర్తించారు. మృతులు ఇద్దరు ఒకే ఇంటికి చెందిన అల్లుళ్లుగా సమాచారం.

error: Content is protected !!