News January 26, 2025
ఏటికొప్పాక: అందరిని ఆకట్టుకున్న లక్క బొమ్మల శకటం

ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించిన ఏటికొప్పాక లక్క బొమ్మల శకటం ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులను ఆకట్టుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. పర్యావరణహితమైన, సహజ సిద్ధమైన వనరులతో తయారుచేసిన ఏటికొప్పాక లక్కబొమ్మలు ఏపీ కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయన్నారు. శకటాల పరంపరలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.
Similar News
News July 7, 2025
250 హెక్టార్లలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం: కలెక్టర్

ఇబ్రహీంపట్నంలోని మూలపాడు బటర్‌ఫ్లై పార్క్ వద్ద 250 హెక్టార్లలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ఆదివారం పర్యాటక రంగ అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ఆయన మాట్లాడుతూ.. జంగిల్ సఫారీ, బయోడైవర్సిటీ పార్క్, నేచర్ ట్రయల్స్ ఏర్పాటు ద్వారా మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో ఎకో టూరిజం అభివృద్ధి చేసేలా జిల్లా దార్శనిక ప్రణాళిక తయారైందన్నారు.
News July 7, 2025
రూ.23 లక్షలతో దుబాయ్ గోల్డెన్ వీసా

భారత్, బంగ్లాదేశ్ ప్రజలు లక్ష ఏఈడీ (రూ.23.30 లక్షలు)లు చెల్లిస్తే దుబాయ్ గోల్డెన్ వీసా పొందొచ్చు. గతంలో రూ.4.66 కోట్లకుపైగా పెట్టుబడి పెడితే గోల్డెన్ వీసా మంజూరు చేసేది. ఇప్పుడు డైరెక్ట్‌గా డబ్బు చెల్లించి వీసా తీసుకోవచ్చు. ఈ వీసా పొందినవారు తమ ఫ్యామిలీతో దుబాయ్‌లో నివసించవచ్చు. డ్రైవర్లు, పనిమనుషులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైనా జాబ్, బిజినెస్ చేసుకునే ఛాన్స్ ఉంది. జీవితకాలం అక్కడే ఉండొచ్చు.
News July 7, 2025
షార్ట్ ఫిలిం పోటీలకు దరఖాస్తు చేసుకోండి: ములుగు కలెక్టర్

జాతీయ మానవ హక్కుల సంఘం(NHRC) ఆధ్వర్యంలో నిర్వహించే షార్ట్ ఫిలిం పోటీలకు అన్ని వర్గాల ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. మానవ హక్కులపై అవగాహన కల్పించే విధంగా 3 నుంచి 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింలను nhrcshrotfilm@gmail.comకు పంపించాలన్నారు. విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.2 లక్షల నుంచి రూ.లక్ష వరకు అందిస్తారన్నారు.