News March 7, 2025
ఏటికొప్పాక లక్కబొమ్మల స్టాల్ను సందర్శించిన రాష్ట్రపతి

ఏటికొప్పాక లక్క బొమ్మల స్టాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. వివిధత కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల హస్త కళాకారులు రూపొందించిన బొమ్మలు వస్త్రాలను ఈనెల 4 నుంచి 9 వరకు రాష్ట్రపతి భవన్లో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. ఏటికొప్పాక బొమ్మలను ఆసక్తిగా రాష్ట్రపతి తిలకించారు. వాటిని ఏ విధంగా తయారు చేస్తారో కళాకారుడు శరత్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 15, 2025
యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

భారతదేశంలో సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కొత్తగూడెంలో యూనిటీ మార్చ్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, బీజేపీ మాజీ అధ్యక్షుడు రంగా కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
News November 15, 2025
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్

తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం కలిగింది. ఈ సమయంలోనే న్యాయస్థానం వెబ్సైట్లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం కావడంతో సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు హ్యాకర్ల గురించి దర్యాప్తు చేపట్టారు.
News November 15, 2025
సంగారెడ్డి: సర్వే చేయించుకున్నారు.. పైసలిస్తలేరు!

జిల్లాలో గత ఏడాది సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎన్యుమరేటర్లకు పారితోషకాన్ని చెల్లించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సర్వే చేసి ఏడాది గడిచిన పారితోషకం చెల్లించకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారితోషకాన్ని వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.


