News March 3, 2025
ఏటికొప్పాక: హస్త కళాకారుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో కలెక్టర్ విజయకృష్ణన్ సోమవారం పర్యటించారు. ఏటి కొప్పాక లక్క బొమ్మలు తయారు చేసే హస్త కళాకారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లక్క బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్రకు కొరత ఏర్పడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రాష్ట్రపతి అవార్డు గ్రహీత చిన్నయచారి, రిపబ్లిక్‌డే శకటం డిజైనర్ గోర్స సంతోష్ కుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News September 16, 2025
దేవుడి భూములను కొట్టేస్తే సమగ్ర విచారణ చేసుకోండి – పేర్ని నాని

మచిలీపట్నంలోని రంగనాయక స్వామి దేవస్థానంకు చెందిన భూములను తాను కారు చౌకగా కొట్టేశానని కూటమి నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. నిజంగా స్వామి వారి భూములను తాను అక్రమ మార్గంలో తీసుకుంటే నాడు జరిగిన వేలంపాటపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ అవినీతిని తాను బట్టబయలు చేస్తుండటంతో తనపై కక్ష కట్టి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News September 16, 2025
వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ

AP: వైఎస్ వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. కోర్టు తగిన ఆదేశాలిస్తే ముందుకు వెళ్తామని పేర్కొంది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.
News September 16, 2025
పేదరిక నిర్మూలనే పీ-4 లక్ష్యం: VZM జేసీ

పేదరిక నిర్మూలనే పీ-4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జేసీ ఎస్.సేతు మాధవన్ స్పష్టం చేశారు. మార్గదర్శులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని, వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. పీ-4 కార్యక్రమం, బంగారు కుటుంబాలు, మార్గదర్శుల పాత్రపై సచివాలయం నుంచి ఎంపిక చేసిన ఎంవోటీ, టీవోటీలకు కలెక్టరేట్లో మంగళవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.