News February 25, 2026
ఏటి సూతకం అంటే ఏంటి..?

తల్లి/తండ్రి మరణిస్తే కుమారుడు వారి మరణానంతర కర్మలను ఓ ఏడాది పాటు నిర్వహించే కాలాన్ని ‘ఏటి సూతకం’ అంటారు. శాస్త్రం ప్రకారం.. తండ్రి ఆత్మయే కొడుకుగా జన్మిస్తుంది. అందుకే తండ్రి మరణించాక ఆయన జీవుడి అభ్యున్నతి కోసం ఏడాది పాటు సత్కర్మలు చేయడం కొడుకు బాధ్యత. ఈ కాలంలో చేసే అన్నదానం, వస్త్రదానం, పురాణ శ్రవణం.. ఇవన్నీ మరణించిన తల్లిదండ్రుల ఖాతాలో చేరతాయి. ఇది వారిపై కృతజ్ఞతను చాటుకునే పవిత్ర సమయం.
Similar News
News April 14, 2026
3K టు 152K.. రఫేల్‌లా దూసుకెళ్లిన ప్రఫుల్ ఫాలోయింగ్

నిన్న RRపై తొలి ఓవర్లోనే 3 వికెట్లు, మొత్తంగా 4 వికెట్లు కూల్చిన <<19644312>>ప్రఫుల్(SRH)<<>> ఇన్‌స్టాలో రఫేల్‌లా దూసుకెళ్లారు. ఈ మ్యాచ్‌కు ముందు ఆయన అకౌంట్‌కు కేవలం 3 వేల ఫాలోవర్లు ఉండగా గంటల్లోనే ఆ సంఖ్య 152Kకు చేరింది. ఐపీఎల్ పవర్ ఇదేనని, 4 ఓవర్ల బౌలింగ్ ఆయన లైఫ్‌నే మార్చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇలాగే ప్రదర్శన చేస్తే తిరుగుండదని పేర్కొంటున్నారు. మీరేమంటారు?
News April 14, 2026
గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు.. రేపే ప్రారంభం

AP: ప్రస్తుతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్న అన్న క్యాంటీన్లు గ్రామాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఒకేసారి 62 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. రేపు పల్నాడు(D) ధరణికోటలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ఓపెన్ చేసి పేదలతో భోజనం చేస్తారు. కాగా పట్టణాల్లోని 207 క్యాంటీన్లలో ప్రభుత్వం రూ.5కే ఫుడ్ అందిస్తోంది. రోజుకు సగటున 2.10 లక్షల మంది ఆకలి తీర్చుకుంటున్నారు.
News April 14, 2026
ఇవాళ సెలవు

రాజ్యాంగ నిర్మాత Dr.BR అంబేడ్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులకు ఇవాళ సెలవు ఉంది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్టాక్ మార్కెట్లు, కోర్టులు, పోస్టాఫీస్‌లకు వర్తించనుంది. ఎమర్జెన్సీ సర్వీసులకు మినహాయింపు ఉంటుంది. తమిళనాడు, అస్సాం నూతన సంవత్సరాలు, సిక్కుల అతిపెద్ద పండుగ బైసాఖీ, మహా విశ్వసంక్రాంతి పండుగలు కూడా నేడు జరుపుకుంటున్నారు. మీకూ సెలవు ఉందా?


