News April 5, 2025

ఏటీసీ నిర్మాణాన్ని పూర్తి చేయాలి: పెద్దపల్లి కలెక్టర్

image

పెద్దపల్లి ఐటీఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటీసీ (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. ఏటీసీ భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. 6 ట్రేడ్‌లతో యువతకు ఉపాధి శిక్షణ అందించేందుకు ఐటీఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏటీసీ  భవన నిర్మాణం, పరికరాల అమరిక పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.

Similar News

News November 26, 2025

22A భూములపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి: మంత్రి నాదెండ్ల

image

22A కింద నమోదైన జిరాయితీ భూముల యజమానులు భూములు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. పొరపాటుగా నమోదైన భూములను 22A జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, దీనిని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు.

News November 26, 2025

అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష: ఎస్పీ

image

మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పోక్సో కోర్టు జడ్జి వై. వెన్నయ్య నాయుడు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ రాహుల్ మీనా బుధవారం తెలిపారు. అంబాజీపేట మండలం చిరుతపూడికి చెందిన కట్టా బ్రహ్మేశ్వరరావు, అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సత్వర దర్యాప్తుతో నిందితుడికి శిక్ష పడింది.

News November 26, 2025

సమాచార హక్కు చట్టం పారదర్శకంగా అమలు చేయాలి: ఆర్టీఐ కమిషనర్

image

సమాచార హక్కు చట్టం పారదర్శకంగా అమలు కావాలని ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అధికారులను సూచించారు. బుధవారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి, అధికారులు భయపడకుండా ప్రజలకు సమాచారం అందించాలన్నారు. అన్ని శాఖల్లో రిజిస్టర్ నిర్వహణ చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచించారు.