News January 31, 2025
ఏటుకూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం!

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతిచెందిన యువకుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 14, 2025
‘ఉమ్మడి గుంటూరులో దడపుట్టిస్తున్న జీబీఎస్’

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడు గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS) కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జీజీహెచ్‌లో వీరికి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రాలోని పూణేలో 172 జీబీఎస్ కేసులు నమోదు కావడం సంచలనం రేపింది. శ్రీకాళంలో పదేళ్ళ బాలుడు మృతి చెందినప్పటి నుంచి ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఊపిరి అందకపోవడం, గొంతు మింగుడు పడకపోవడం, చేతులు, కాళ్ళు చచ్చుపడటం జీబీఎస్ ప్రధాన లక్షణాలు.
News February 14, 2025
ప్రేమికులు తస్మాత్ జాగ్రత్త: బజరంగదళ్

వాలంటైన్స్ డే పేరు చెప్పుకొని విచ్చలవిడిగా తిరిగే ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలని గుంటూరు జిల్లా బజరంగదళ్ నాయకులు హెచ్చరించారు. ఫిబ్రవరి 14 అంటే పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మన జవాన్లు దారుణంగా మృతిచెందిన రోజని చెప్పారు. ఇది సంతాపదినమే కానీ ప్రేమికుల దినోత్సవం కాదన్నారు. విచ్చలవిడితనానికి, లవ్ జిహాదీకి తాము వ్యతిరేకమని, ఆడవాళ్ల మాన ప్రాణాలకు రక్షణగా ఉంటామన్నారు.
News February 14, 2025
సీఎం సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి

మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరారు. గురువారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి ఆళ్ల నానిని సీఎం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సీనియర్ నేత సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నారు.