News February 22, 2025

ఏటూరునాగారంలో దొంగనోటు కలకలం!

image

ఏటూరునాగారంలో శుక్రవారం రూ.100 దొంగనోటు కలకలం రేపింది. ఓ రిక్షా కార్మికుడి వద్ద దొంగ నోటు వెలుగులోకి వచ్చింది. సదరు రిక్షా కార్మికుడు ఓ కూల్ డ్రింక్ షాపు వద్ద రూ.100 నోటు ఇవ్వగా.. షాపు యజమాని దొంగ నోటును గుర్తించాడు. అయితే ఈ నోటు ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు.? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News January 11, 2026

ఇదేనా పవన్ కళ్యాణ్ ఆదివాసీలను ఆదుకునే తీరు: వైసీపీ

image

బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీలోని ఐదు గిరిజన గ్రామాల ప్రజలను ట్రైబల్ అధికారులు పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శించింది. సుమారు 100 కుటుంబాలు సమస్యలతో బాధపడుతుండగా.. పవన్ కళ్యాణ్ ఫొటోలు పట్టుకొని <<18806211>>మెడకు ఉరి<<>> తాళ్లు బిగించుకొని గిరిజనులు వినూత్న నిరసన చేపట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొంది. ‘ఇదేనా పవన్ కళ్యాణ్ ఆదివాసీలను ఆదుకునే తీరు?’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.

News January 11, 2026

ఖమ్మం: మ్యూజియం ముచ్చట తీరేదెన్నడు?

image

ఖమ్మం జిల్లా సైన్స్‌ మ్యూజియం ఏర్పాటుపై విద్యాశాఖ తీరు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. మ్యూజియం కోసం రూ.50 లక్షల నిధులు కేటాయించినా, పనులు అడుగు ముందుకు పడటం లేదు. మ్యూజియం వివరాలు అందజేయాలని డీఈవో ఆదేశించి 15 రోజులు గడుస్తున్నా కిందిస్థాయి సిబ్బందిలో నిర్లక్ష్యం వీడలేదు. ప్రయోగాత్మక విద్యకు ఈ జాప్యం పెద్ద అడ్డంకిగా మారింది.

News January 11, 2026

ఆనందపురంలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే

image

ఆనందపురం మండలంలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కేజీ రూ.950-1000 ఉండగా.. చికెన్ (స్కిన్ లెస్) కేజీ రూ.300గా ఉంది. విత్ స్కిన్ కేజీ రూ.280 చొప్పున విక్రయిస్తున్నారు. శొంఠ్యాం కోడి కేజీ రూ.310గా ఉంది. అలాగే డజన్ గుడ్లు రూ.90కి కొనుగోలు చేస్తున్నారు. గత వారంతో పోల్చుకుంటే దాదాపు అన్ని రేట్లు కాస్త పెరిగాయని వినియోగదారులు తెలిపారు.