News February 3, 2025
ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి

ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.
Similar News
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.
News December 5, 2025
కొనకనమిట్ల : ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి!

కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. ఇళ్లలోని వస్తువులు సైతం కదిలినట్లు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్రలో నుంచి లేచి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.
News December 5, 2025
మంచిర్యాల: సర్పంచ్ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లికి చెందిన ట్రాన్స్జెండర్ వైశాలి సర్పంచ్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీని జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో వైశాలి సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి దిగారు. సర్పంచ్గా తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని ఆమె గ్రామ ప్రజలను కోరారు. ఆమె నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.


