News February 3, 2025
ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి

ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.
Similar News
News February 17, 2025
రూ.15 కోట్లు పెట్టి ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కొన్నాడు!

ఖరీదైన కారుకు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ఉండాలని చాలా మందికి ఉంటుంది. దానికోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు కొందరు వెనకాడరు. అలాంటి ఓ వ్యక్తి ఏకంగా HK$14.2 మిలియన్లు (రూ.15.83 కోట్లు) పెట్టి అరుదైన సింగిల్-లెటర్ రిజిస్ట్రేషన్ మార్క్ ‘S’ను కొనుగోలు చేశారు. ఇది హాంకాంగ్ దేశంలో రవాణా శాఖ నిర్వహించిన వేలంలో జరిగింది. అలాగే ‘88’ అనే నంబర్ ప్లేట్‌ను HK$11 మిలియన్లకు (రూ.12 కోట్లు) మరో వ్యక్తి దక్కించుకున్నారు.
News February 17, 2025
చేనేతల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్

చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి అధికారులు కృషి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. చేనేత కుటుంబాల జీవన స్థితిగతులను మెరుగుపరచటానికి తీసుకోవాల్సిన చర్యల పై సంబంధిత అధికారులతో సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముద్ర పథకం కింద చేనేత కుటుంబాలకు చేయూత అందించేందుకు రుణాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
News February 17, 2025
కేజీహెచ్‌లో GBS మరణం? కొట్టిపారేసిన సూపరింటెండ్

AP: విశాఖపట్నం కేజీహెచ్‌లో GBSతో ఓ మహిళ మృతి చెందిందన్న ప్రచారాన్ని ఆసుపత్రి సూపరింటెండ్ శివానందం కొట్టిపారేశారు. ఇప్పటివరకు ఐదు అనుమానిత కేసులు నమోదయ్యాయని, ఎవరూ మరణించలేదని చెప్పారు. ఇది అంటువ్యాధి కాదని వెల్లడించారు. కాగా ఛాతిలో నొప్పితో ఎల్.కోట మండలం మల్లివీడుకు చెందిన రేణుకా మహంతి ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వార్తలొచ్చాయి.