News February 3, 2025
ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి

ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.
Similar News
News November 20, 2025
సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుందో తెలుసా?

సావిత్రి తన వాక్చాతుర్యంతో భర్త సత్యవంతుడి ప్రాణాలను కాపాడుకుంది. యముడు తన భర్త ప్రాణాలను తీసుకొని వెళ్తుంటే అడ్డుపడింది. ధర్మబద్ధమైన సంభాషణలతో యముడిని మెప్పించి, 3 వరాలు పొందింది. మూడో వరంగా సత్యవంతుడి ద్వారా 100 మంది పుత్రులు కావాలని కోరింది. యముడు వరమివ్వగానే ‘నా భర్త మీ వెంట ఉంటే, నాకు పుత్రులు ఎలా కలుగుతారు?’ అని ప్రశ్నించింది. భర్త ప్రాణాలు తీయడానికి వచ్చిన యముడి చేతే భర్తను బతికించుకుంది.
News November 20, 2025
జగిత్యాల: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలి మృతి

మల్యాల(M) పోతారం గ్రామానికి చెందిన పున్న లచ్చవ్వ(59) ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మృతిచెందినట్లు SI నరేష్ తెలిపారు. కాగా మృతురాలు తన సోదరుడి ఇంట్లో నివాసముంటోంది. ఈ క్రమంలో మంగళవారం ఇంటిబయట గడ్డికి నిప్పుపెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు మంటలు అంటుకొని గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సోదరుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.
News November 20, 2025
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేయాలి: జేసీ

రానున్న వారం రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాలలో వరి కోతలు ముమ్మరం కానున్న నేపథ్యంలో, ఖరీఫ్ 2025-26 సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేయాలని జేసీ రాహుల్ అధికారులను ఆదేశించారు. గురువారం జేసీ ఛాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని పరికరాలను రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.


