News February 3, 2025
ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి

ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.
Similar News
News January 9, 2026
వరంగల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. వంట సిబ్బంది తొలగింపు

వరంగల్ జిల్లా సంగెంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ డా.సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట చేసే సిబ్బంది విద్యార్థినులతో అమర్యాదగా ప్రవర్తించడం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి, ముగ్గురు వంట సిబ్బందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News January 9, 2026
జగిత్యాల: ‘కోర్టులు – పోలీస్ సమన్వయం అత్యవసరం’

న్యాయవ్యవస్థను ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా అందించాలంటే కోర్టులు – పోలీస్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో పెండింగ్ క్రిమినల్ కేసులు, చార్జ్షీట్ల దాఖలు, సమన్లు, ఎన్బీడబ్ల్యూ అమలు, సాక్షుల హాజరు వంటి అంశాలపై చర్చించారు. లోక్‌అదాలత్ ద్వారా 1051 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు.
News January 9, 2026
ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా: భట్టి

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఇందుకోసం ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిశాయన్నారు. ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్‌కో, SPDCL, NPDCL, జెన్కో ఉద్యోగులకు రూ.కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.


