News February 23, 2025
ఏటూరునాగారం ఐటీడీఏ గిరిజన మహిళలకు శిక్షణ

ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన మహిళలకు 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో చేపట్టినట్లు జేడీఎం కొండలరావు తెలిపారు. ఉట్నూరులో తయారీ అవుతున్న ఇప్పపువ్వు లడ్డు, నాప్కిన్ తయారీపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజనులు అభివృద్ధి చెందడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తయారీకి ఉపయోగించే ముడి సరుకు, నాణ్యత గురించి తెలుసుకున్నారన్నారు.
Similar News
News December 23, 2025
GWL: హక్కులపై అవగాహన ఉండాలి: ప్రిన్సిపల్

వినియోగదారులు తమ హక్కులను ఆయుధంగా మలుచుకున్నప్పుడే మార్కెట్లో మోసాలను అరికట్టవచ్చని ఎంఏఎల్డీ కళాశాల ప్రిన్సిపల్ డా.కలందర్ బాషా అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం గద్వాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘ఆస్రా’ బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, ప్రజలు వినియోగదారుల చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.
News December 23, 2025
ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారా? మీ గుండె ప్రమాదంలో ఉన్నట్టే!

వ్యాయామం ఎక్కువగా చేస్తే గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. గుండె పనితీరుపై భారం పడి హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. హార్ట్బీట్లో మార్పులు కనిపిస్తాయి. ఛాతీ నొప్పి, పాల్పిటేషన్స్, మయోకార్డిటిస్, అలసట సమస్యలు ఎక్కువవుతాయి. తలతిరగడం, గుండె కండరాల్లో వాపు ఏర్పడే ప్రమాదం ఉంది. బీపీ పెరిగి హార్ట్ బీట్లో మార్పులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో సీరియస్ హార్ట్ ఇష్యూస్కు దారితీసే ప్రమాదం ఉంది.
News December 23, 2025
నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలి: DMHO

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పేద ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే దిశగా మరింత కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.యుగంధర్ ఆదేశించారు. మంగళవారం మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్ సేవలు, ప్రయోగశాల (ల్యాబ్), ఫార్మసీ, ప్రసవ గది తదితర విభాగాలను పరిశీలించారు.


