News February 23, 2025
ఏటూరునాగారం ఐటీడీఏ గిరిజన మహిళలకు శిక్షణ

ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన మహిళలకు 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో చేపట్టినట్లు జేడీఎం కొండలరావు తెలిపారు. ఉట్నూరులో తయారీ అవుతున్న ఇప్పపువ్వు లడ్డు, నాప్కిన్ తయారీపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజనులు అభివృద్ధి చెందడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తయారీకి ఉపయోగించే ముడి సరుకు, నాణ్యత గురించి తెలుసుకున్నారన్నారు.
Similar News
News March 24, 2025
సంచలనం.. రూ.50 కోట్ల క్లబ్‌లోకి ‘కోర్ట్’!

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్’ సినిమా సంచలనం సృష్టిస్తోంది. రిలీజైన 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ.50.80 కోట్లు వసూలు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. దాదాపు రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసి భారీ లాభాలను పొందింది. థియేటర్ కలెక్షన్లతో పాటు శాటిలైట్, ఓటీటీ రైట్స్‌కు మరిన్ని లాభాలొచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
News March 24, 2025
అనకాపల్లి కలెక్టరేట్ వద్ద నిర్వాసితుల ఆందోళన

పరిహారం చెల్లించిన తర్వాతే రహదారి పనులు మొదలు పెట్టాలని అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులు అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో రోడ్డు నిర్వాసితుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎస్ బ్రహ్మాజీ, ఆర్ రాము మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లు ఇస్తే వీరికి ఉపయోగం లేదన్నారు. బాండ్ల స్థానంలో నగదు చెల్లించాలన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు.
News March 24, 2025
గద్వాల: ‘నీళ్లు ఇచ్చే దాకా కదలం’

అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్‌డీఎస్ రైతులు సాగు నీళ్ల కోసం కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సుమారు పన్నెండు గ్రామాల రైతులు మాట్లాడుతూ.. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాగు నీరు అందించాలని కోరారు. నీళ్లు ఇచ్చేదాకా కదలమని భీష్మించుకుని కూర్చున్నారు.