News February 26, 2026

ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా బదిలీ

image

ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా బదిలీ అయ్యారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ బదిలీల్లో భాగంగా ఆమెను కరీంనగర్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఫిబ్రవరి 12న జరిగిన బదిలీల్లో ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా మొదటిసారి మహిళ ఐఏఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2019 బ్యాచ్‌కు చెందిన చిత్రమిశ్రా గతంలో నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.

Similar News

News April 19, 2026

2027లో అల్లు అర్జున్ ‘రాకా’?

image

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న ‘రాకా’ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి. షూటింగ్‌లో ఆలస్యం జరుగుతుండటంతో ఈ సినిమా 2027లో రాదనే వార్తలు వినిపించాయి. అయితే ఆ రూమర్స్‌లో నిజం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా బన్నీ తన షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తారట. భారీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉన్నప్పటికీ 2027 సెకండాఫ్‌లోనే మూవీని రిలీజ్ చేసేలా అట్లీ ప్లాన్ చేస్తున్నారని టాక్.

News April 19, 2026

మెదక్: ఇంటికి చేరాలి.. షార్ట్ ఫిల్మ్‌ను ప్రారంభించిన ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కోసం రూపొందించిన “ఇంటికి చేరాలి…” అనే షార్ట్ ఫిల్మ్‌ను ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. 99 రోజుల ప్రజా ప్రణాళిక “సురక్షిత ప్రయాణం” కార్యక్రమంలో భాగంగా రూపొందిన ఈ చిత్రం యువతలో మార్పు తీసుకురావడమే లక్ష్యంమని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, జరిమానాలు, శిక్ష కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసం అనే సందేశాన్ని అందిస్తోందని తెలిపారు.

News April 19, 2026

59 సార్లు కాంగ్రెస్ పేరెత్తారు.. మోదీపై ఖర్గే ఫైర్

image

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ప్రసంగంలో ప్రధాని 59 సార్లు కాంగ్రెస్ పేరెత్తారని, మహిళల గురించి మాత్రం తక్కువగా మాట్లాడారని విమర్శించారు. మోదీ ప్రాధాన్యం మహిళలు కాదని, కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అధికారిక వేదికను రాజకీయ విమర్శలకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని ఆరోపించారు.