News March 5, 2025

ఏటూరునాగారం: నలుగురు మావోయిస్ట్ కొరియర్లు అరెస్ట్

image

నిషేధత మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. వెంకటాపురం మండలం కొత్తపల్లి క్రాస్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన నలుగురు అనుమానస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని విచారించగా మావోయిస్టు పార్టీకి గత కొంతకాలంగా పనిచేస్తున్నట్లు తెలిపారన్నారు.

Similar News

News November 6, 2025

KGF నటుడు కన్నుమూత

image

కేజీఎఫ్ నటుడు <<17572420>>హరీశ్ రాయ్<<>> కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. KGF-1లో హరీశ్ రాయ్.. ఛాఛా అనే పాత్రలో నటించారు. రెండో పార్ట్ రిలీజైన నాటికే ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అది నాలుగో స్టేజీకి చేరడంతో పూర్తిగా బక్కచిక్కిపోయారు. ఆర్థిక సాయం చేయాలని కోరగా నటుడు ధ్రువ్ సర్జా హెల్ప్ చేశారు. పరిస్థితి చేజారిపోవడంతో ఆయన మరణించారు.

News November 6, 2025

RGM: రోజుకు 2.75లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తేనే టార్గెట్ రీచ్

image

సింగరేణి వ్యాప్తంగా(2025- 26) ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌ను నిర్దేశించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈసారి భారీ వర్షాలు, తుఫాను నేపథ్యంలో 11 డివిజన్లలో గడిచిన 7 నెలల్లో 32.64 MTల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించింది. ఇకపై టార్గెట్ రీచ్ కావాలంటే రోజుకు 2.75లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.

News November 6, 2025

మెదక్: అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

image

అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవినీతి జాడ్యాన్ని రూపుమాపాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ప్రతి రోజు అవినీతి డబ్బుతో ఏసీబీకి దొరకడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి అధికారులు, సిబ్బంది బాధ్యత అన్నారు.