News March 6, 2025
ఏటూరునాగారం: ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా!

ఏటూరునాగారంలోని 7వ వార్డు ఎస్టీ(బాలుర) హాస్టల్ వద్ద విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. స్తంభానికి చెట్టు, వైర్లకు తీగలు అల్లుకున్నాయి. విద్యార్థులు నిత్యం విద్యుత్ స్తంభం పక్కనే టాయిలెట్లు, బాత్రూమ్స్ ఉండటంతో తరచూ వచ్చి వెళుతుంటారు. చెట్లను తొలగించాలని గ్రామపంచాయతీ, విద్యుత్ అధికారులకు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా.? అంటున్నారు.
Similar News
News November 19, 2025
ఎన్ కౌంటర్లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.
News November 19, 2025
రాజన్న ఆలయంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో రాజన్న ఆలయాన్ని విస్తరించనున్న నేపథ్యంలో ఆలయంలో ఇప్పటికే ఉన్న పలు కట్టడాలను తొలగిస్తున్నారు. దక్షిణం వైపుగల కోటిలింగాలను ముందుగా తరలించి, ప్రాకారాన్ని కూల్చివేస్తున్నారు. స్వామివారి అద్దాల మండపం తొలగింపు పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి.
News November 19, 2025
స్పోర్ట్స్ రౌండప్

☞ 100 టెస్టులు ఆడిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్గా ముష్ఫికర్ రహీమ్ రికార్డు
☞ పార్ట్ టైమ్ ఆల్రౌండర్లను టెస్టుల్లోకి తీసుకోవద్దు.. లేదంటే భారత్ WTC ఫైనల్కు చేరడం కష్టం: సునీల్ గవాస్కర్
☞ డెఫ్లింపిక్స్లో భారత షూటర్ ధనుష్ శ్రీకాంత్కు రెండో గోల్డ్ మెడల్.. ఇటీవల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన శ్రీకాంత్, 10m మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ గోల్డ్ గెలిచాడు


