News March 25, 2025
ఏటూరునాగారం: బోనోఫిక్స్ విక్రయిస్తున్న మహిళపై కేసు

మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై తాజుద్దీన్ హెచ్చరించారు. ఏటూరునాగారానికి చెందిన బట్టు సుజాత అనే మహిళ కంగన్ హాల్ నడుపుతూ బోనోఫిక్స్ అనే మత్తు పదార్థాన్ని విక్రయిస్తుందన్న సమాచారం మేరకు అదుపులోకి తీసుకొని ఆమెపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. విద్యార్థులు, చిన్న పిల్లలకు మత్తు పదార్థాలైన బోనోఫిక్స్ విక్రయిస్తూ విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News December 4, 2025
గద్వాల్: ఓ యువత ఏటువైపు మీ ఓటు..!

జోగులాంబ గద్వాల జిల్లాలో 11,600 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఈ సారి జరిగే సర్పంచ్ ఎలక్షన్లలో మొదటి ఓటు వేయడానికి ఉత్సాహ పడుతున్నారు. అభివృద్ధి చేసే వారికి ఓటు వేస్తారా లేక మాటలు చెప్పి మబ్బి పెట్టే వారికి ఓటు వేస్తారా అనే సందేహం ఉంది. యువత మాత్రం అభివృద్ధి చేసే వారికే ఓటు వేస్తారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. యువత తలచుకుంటే ఏదైనా చేస్తారని పలువురు ప్రజలు అంటున్నారు. దీనిపై మీ కామెంట్..?
News December 4, 2025
నిజామాబాద్: 27 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవం

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ బుధవారంతో ముగియగా జిల్లాలో 27 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. వర్ని మండలంలో 10, బోధన్ మండలంలో 4, సాలూర మండలంలో 3, కోటగిరి మండలంలో 5, చందూరు మండలంలో 2, పోతంగల్, ఎడపల్లి, నవీపేట్ మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.
News December 4, 2025
Dy.Cm భట్టి స్వగ్రామం సర్పంచి స్థానం ఏకగ్రీవం

Dy.Cm భట్టి విక్రమార్క స్వగ్రామమైన వైరా(మం) స్నానాలలక్ష్మీపురం గ్రామపంచాయతీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నూతి వెంకటేశ్వరరావుకు పోటీగా వేసిన ఇతర అభ్యర్థులందరూ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో పంచాయతీ సర్పంచ్తో పాటు 8 వార్డుల ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి, ఐక్యత దృష్ట్యా భట్టి, ఎమ్మెల్యే రాందాస్ సూచనలతో పోటీదారులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.


