News January 27, 2025
ఏటూరునాగారం: భార్య కాపురానికి రావడంలేదని భర్త ఆత్మహత్య

భార్య కాపురానికి రాకపోవడంతో భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘనపురంలో జరిగింది. ఎస్ఐ తాజుద్దీన్ తెలిపిన వివరాలు.. గంజి రంజిత్ (32), స్వాతి దంపతులు. 15 రోజుల క్రితం వీరిద్దరు గొడవపడడంతో స్వాతి పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో రంజీత్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 17, 2025
వచ్చే ఏడాది నా పెళ్లి: సాయి దుర్గ తేజ్

టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంచి సినిమాలు, గొప్ప జీవితం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలిపేందుకే తిరుమల వచ్చానన్నారు. పెళ్లిపై ఓ జర్నలిస్టు ప్రశ్నించగా ‘వచ్చే ఏడాదిలోనే నా వివాహం ఉంటుంది’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ‘సంబరాల ఏటిగట్టు’ అనే మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇది వచ్చే సంవత్సరం విడుదల కానుంది.
News November 17, 2025
అలంపూర్ జోగులాంబ ఆలయంలో నేడు దీపోత్సవం

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానంలో కార్తీక మాసం చివరి సోమవారం కావడం తుంగభద్ర పుష్కర్ ఘాటు దగ్గర సామూహిక దీపోత్సవం నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఐదు వేల ప్రమిదలతో దీపాలు వెలిగించనున్నారు. భక్తులకు ఉచితంగా ప్రమిదలు, కుంకుమ, పసుపు, గాజులు ఇవ్వనున్నట్లు దేవస్థానం ఈవో దీప్తి తెలిపారు. దీపోత్సవం తర్వాత స్వామివారి రథోత్సవం జరుగుతుంది.
News November 17, 2025
KNR: NTR వీరాభిమాని గుండెపోటుతో మృతి

రాజకీయాల్లో చంద్రబాబు నాయడు కంటే సీనియర్, NTR వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య గుండెపోటుతో KNRలో మృతి చెందారు. TDP ఆవిర్భావం నుంచి ఆగయ్య పార్టీని వీడకుండా పనిచేస్తూ ఎన్టీఆర్ వీరాభిమానిగా గుర్తింపు పొందారు. పేరు పెట్టి పిలిచేంతగా, ఎన్టీఆర్ కుటుంబంలో తెలిసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సేవలను గుర్తించి మహానాడు కార్యక్రమంలో ఆగయ్యను సన్మానించారు కూడా.


