News April 3, 2025
ఏటూరునాగారం: భార్య చేతిలో భర్త హతం!

భార్య చేతిలో భర్త హతమైన ఘటన ఏటూరునాగారం మండలం రోహీరులో జరిగింది. స్థానికుల వివరాలు.. భర్త మండప సమ్మయ్య తరచూ మద్యం తాగి గొడవ పెడుతున్నాడు. విసుగు చెందిన భార్య నేడు తీవ్రంగా కొట్టడంతో సమ్మయ్య మృతి చెందాడన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 13, 2025
NLG: ఈసీపై నమ్మకం పోయింది: జగదీష్ రెడ్డి

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దారుణంగా మారిందని, ఈసీపై నమ్మకం పోయిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి, అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.
News December 13, 2025
జగిత్యాల: నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష కేంద్రాల పరిశీలన

జవహర్ నవోదయ విద్యాలయం 2026–2027 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన అర్హత పరీక్ష సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము శనివారం పరిశీలించారు. ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాల, గోవిందుపల్లిలోని గౌతమ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల వసతులు, పరీక్ష ఏర్పాట్లు, హాజరు శాతం, ఇన్విజిలేటర్ల సన్నద్ధతను పరిశీలించి పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు.
News December 13, 2025
ఇండియాకు కోహ్లీ.. మెస్సీని కలవడానికేనా?

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇండియాకు చేరుకున్నారు. తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబై ఎయిర్పోర్టులో కనిపించారు. ‘గోట్ టూర్’లో భాగంగా భారత్లో ఉన్న మెస్సీని కోహ్లీ కలుస్తారని ప్రచారం జరుగుతోంది. రేపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫ్యాన్స్ను మెస్సీ కలవనున్నారు. ఈ సమయంలోనే ఇద్దరు దిగ్గజాలు మీట్ అవుతారని అభిమానులు భావిస్తున్నారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత కోహ్లీ <<18500552>>లండన్<<>>కు వెళ్లడం తెలిసిందే.


