News April 14, 2025
ఏటూరునాగారం: ‘మావో’లకు వ్యతిరేకంగా పోస్టర్లు!

ఏటూరునాగారంలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివాసీ యువజన సంఘం పేరుతో ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ఆదివాసీలను అడవుల్లోకి వెళ్లకుండా బాంబులు పెట్టి అడ్డుకుంటున్నారని, ఆదివాసీల మీద ‘మావో’ల అప్రకటిత యుద్ధం ఏంటని ప్రశ్నించారు. ఆదివాసీలను చంపటం మీ సిద్ధంతమా? ఇందుకోసమేనా మీ పోరాటం? అని రాసుకొచ్చారు.
Similar News
News November 28, 2025
ఏకగ్రీవాలకు వేలంపాటలు.. SEC వార్నింగ్

TG: సర్పంచ్ ఎన్నికల వేళ ఏకగ్రీవాలకు జోరుగా వేలంపాటలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ పదవిని అంగట్లో సరుకులా డబ్బులు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు ప్రకటించేశారు. దీనిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాల్సిన పదవిని వేలంపాటలో కొనుగోలు చేయడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
News November 28, 2025
IPLలో వైభవ్.. WPLలో దీయా

WPL వేలంలో హరియాణాకు చెందిన 16 ఏళ్ల దీయా యాదవ్ అందరి దృష్టిని ఆకర్షించారు. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటర్ అయిన ఆమెను రూ.10 లక్షల బేస్ ప్రైజ్తో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. దీంతో WPLలో అడుగుపెట్టిన పిన్న వయస్కురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. 2023 U-15 ఉమెన్స్ ట్రోఫీలో 578 రన్స్ బాదడంతో దీయా పేరు తెరపైకి వచ్చింది. వైభవ్ సూర్యవంశీ 13ఏళ్లకే IPLలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
News November 28, 2025
కృష్ణా: నాడు – నేడు పనులు.. పూర్తి చేస్తే బాగు..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు 90% పూర్తైనా, కూటమి ప్రభుత్వం వచ్చాక నిధుల లేమి కారణంగా అసంపూర్తిగా మారాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 175, కృష్ణాలో 100కు పైగా పాఠశాలల్లో మౌలిక వసతులు, 600 స్కూళ్లలో పెయింటింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి. నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తే విద్యార్థులకు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది.


