News April 17, 2025
ఏటూరునాగారం: వడదెబ్బతో కూలీ మృతి

వడదెబ్బతో కూలీ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. 1వ వార్డుకు చెందిన వ్యవసాయ కూలీ పలిశెట్టి వెంకటేశ్వర్లు(62) ప్రతి రోజు సమీపంలోని పంట పొలాలు, మిర్చి కల్లాల వద్దకు పనులకు వెళ్లేవారు. బుధవారం రాత్రి వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే వెంకటేశ్వర్లు మృతి చెందారు.
Similar News
News April 20, 2025
పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి సీతక్క

ఉట్నూర్ మండలం దేవుగూడ ప్రభుత్వ గిరిజన టీడబ్ల్యూపీఎస్ పాఠశాలలో ఆదివారం రాష్ట్ర మంత్రి సీతక్క శిశు బెంచెస్ అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే అన్ని పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. ఎంపీ నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా పాల్గొన్నారు.
News April 20, 2025
గోవిందరావుపేట: భూ భారతిపై రైతులు అవగాహన పెంచుకోవాలి: కలెక్టర్

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ టిఎస్ దివాకర్ అన్నారు. గోవిందరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాతే సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడతామన్నారు. అధికారులు గ్రామాల వారిగా సదస్సులు ఏర్పాటు చేస్తారని తెలిపారు.
News April 20, 2025
బాపట్ల: రేపు చీరాలలో ప్రజా వేదిక- కలెక్టర్

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఈ సమావేశం మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.