News April 15, 2025
ఏటూరునాగారం: వరి పంటను చూసి కన్నీరు పెట్టిన రైతులు

ఏటూరునాగారం మండల వ్యాప్తంగా ఆదివారం కురిసిన ఈదురు గాలులు, వడగండ్ల వర్షంతో వరిపంట నేల వాలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన చిన్నదుర్గయ్య అనే రైతు అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టి వరి పంటను సాగు చేశాడని, ఆదివారం వడగళ్ల వర్షం కురవడంతో వరిపంట, వడ్లు రాలిపోయాయని కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 20, 2025
ఏర్పేడు: సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్కు దరఖాస్తు

ఏర్పేడు వద్ద గల IISER తిరుపతిలో సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్-01 పోస్ట్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మైక్రో బయాలజీ/ మాస్టర్స్ డిగ్రీ ఇన్మైక్రో బయాలజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు కింది వెబ్సైట్ చూడగలరు. https://www.iisertirupati.ac.in/jobs/advt_622025/ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 21 అన్నారు.
News October 20, 2025
ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి: చిరంజీవి

నాగార్జున, వెంకటేశ్, నయనతారతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి. ప్రేమ, నవ్వు, కలిసి ఉండటం వల్ల జీవితం వెలిగిపోతుందన్న విషయాన్ని గుర్తు చేస్తాయి’ అని ట్వీట్ చేశారు. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో హీరోయిన్గా నయనతార, స్పెషల్ రోల్లో వెంకీ మామ కనిపించనున్నారు.
News October 20, 2025
ఇబ్రహీంపట్నం: వడ్డీ వ్యాపారి వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక మనోవేదనకు గురైన ఇబ్రహీంపట్నం మం. యామాపూర్కు చెందిన ఏలేటి జనార్దన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యుల ప్రకారం.. జనార్దన్ నాలుగేళ్ల క్రితం మెట్పల్లికి చెందిన ఓ వ్యాపారి వద్ద రూ.11 లక్షలు అప్పు తీసుకున్నారు. అధిక వడ్డీ వేధింపులతో వ్యాపారి ఆయన భూమిని సెల్ డీడ్ చేయించుకున్నాడు. అప్పు చెల్లించినా వేధింపులు కొనసాగుతుండడంతో జనార్దన్ ఆత్మహత్యకు యత్నించారు.