News April 9, 2025
ఏటూరునాగారం: వారు దరఖాస్తు చేసుకోండి!

ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో పని చేస్తున్న అర్హత కలిగిన అభ్యర్థులు జులై- 2025లో ప్రైవేట్ అభ్యర్థులుగా ఐటీఐ పరీక్షలు రాసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏటూరునాగారం ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లలో 3 ఏళ్లు పైబడిన సర్వీస్ సర్టిఫికెట్, ఎంప్లాయ్ గుర్తింపు కార్డు సమర్పించి ములుగు రోడ్డు వరంగల్ కార్యాలయంలో ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News July 6, 2025
TU: జులై 15 వరకు గడువు ఇవ్వాలి: TUSC JAC

టీయూ రెండో స్నాతకోత్సవంలో పీజీ, Ph.D పట్టాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని TUSC JAC పూర్వ అధ్యక్షుడు సత్యం కోరారు. 12 ఏళ్ల తర్వాత రెండో స్నాతకోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా పీజీ, Ph.D పట్టాలు పొందేందుకు విద్యార్థులకు కేవలం మూడు రోజుల సమయం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి జులై 15వరకు గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
News July 6, 2025
ఫార్మాసూటికల్స్‌లో అపార అవకాశాలు: మోదీ

అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో అద్భుతమైన సమావేశం జరిగినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘అర్జెంటీనాతో 75 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలు, అందులోనూ 5 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. రానున్నకాలం ఇరు దేశాల మధ్య మరింత ఆశాజనకంగా ఉంటుంది. వ్యవసాయం, రక్షణ, భద్రత, ఇంధన రంగాల్లో సహకారం గురించి చర్చించాం. ఫార్మాస్యూటికల్స్, క్రీడల వంటి రంగాల్లోనూ అపారమైన అవకాశాలు ఉన్నాయి’ అని తెలిపారు.
News July 6, 2025
NZB: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలి

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.