News April 3, 2025
ఏటూరునాగారం: 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు

ఇటీవల విడుదలైన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన అజారుద్దీన్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గతంలో విడుదలైన టిజిటి, పిజిటి, గురుకులం జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సైతం సాధించినట్లు తెలిపారు. 4 ఉద్యోగాలు సాధించగా అందులో జూనియర్ లెక్చరర్ (గెజిటెడ్) ఉద్యోగంలో చేరినట్లు పేర్కొన్నాడు. కాగా అజారుద్దీన్ను స్థానికులు ఘనంగా సత్కరించారు.
Similar News
News April 11, 2025
మాజీ ప్రియురాలిపై యువకుడి విచిత్ర ప్రతీకారం!

కోల్కతాలోని లేక్టౌన్ ప్రాంతంలో సుమన్ సిక్దర్ అనే యువకుడు మాజీ గర్ల్ఫ్రెండ్పై విచిత్రంగా ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. తనకు బ్రేకప్ చెప్పిందన్న కోపంతో 4 నెలల వ్యవధిలో 300కు పైగా క్యాష్ ఆన్ డెలివరీ పార్సిల్స్ను ఆమె ఇంటికి బుక్ చేశాడు. ఆ డెలివరీలు తనకెందుకు వస్తున్నాయో తెలియక తీవ్ర ఒత్తిడికి గురైన యువతి పోలీసుల్ని ఆశ్రయించగా అసలు విషయం వెలుగుచూసింది. దీంతో సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
News April 11, 2025
వాహనాలను తీసుకవెళ్లండి: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించాలని నిర్ణయించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను హనుమకొండ భీమారం, సీఆర్పీఎఫ్ కేంద్రంలో భద్రపర్చారు. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహనాలను తిరిగి అందజేయబడుతుందని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
News April 11, 2025
వేసవిలో వాకింగ్.. ఎప్పుడు చేయాలంటే..

వాకింగ్ అలవాటున్నవారికి వేసవిలో వేడిమి సమస్యగా ఉంటుంది. వారు ఆలస్యంగా లేచి వాకింగ్ చేయడం మంచిదికాదని జీవనశైలి నిపుణులు పేర్కొంటున్నారు. ‘సమ్మర్లో ఉదయం 7.30 గంటల్లోపు వాకింగ్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత సూర్యుడి తీవ్రత పెరుగుతుంటుంది. అది ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఉదయం 10 గంటలు దాటాక, సాయంత్రం 5 గంటలలోపు ఆరుబయట వ్యాయామం, వాకింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు’ అని సూచిస్తున్నారు.