News August 17, 2024
ఏడాదికి 15% వృద్ధి సాధించే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్

రానున్న ఏడాదికి 15శాతం వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళిక సిద్ధం చేయాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఈవో పీఆర్డీలతో ఆంధ్ర-2047 జిల్లా యాక్షన్ ప్లాన్‌పై సమావేశం నిర్వహించారు.
Similar News
News December 3, 2025
కన్నం వేసి.. రూ.8లక్షల పేలుడు పదార్థాల చోరీ

పెద్దవడుగూరు మండలం కోనాపురంలోని ఓ స్టోరేజ్ పాయింట్లో చోరీ జరిగింది. స్టోరేజ్ పాయింట్‌కు గుర్తు తెలియని వ్యక్తులు కన్నం వేసి, లోపలికి చొరబడ్డారు. సుమారు రూ.8 లక్షల విలువైన పేలుడు పదార్థాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై స్టోరేజ్ పాయింట్ నిర్వాహకుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 2, 2025
ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ

విధులలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ MPDOకు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. PGRS గ్రీవెన్స్‌లో నిర్ణీత గడువులోగా అర్జీలను చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. చిన్న పోలమాడ పంచాయతీ కార్యదర్శి బలరామమూర్తి, హవళిగి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఉరవకొండ డిప్యూటీ MPDO సతీశ్ కుమార్‌కు నోటీసులు ఇచ్చామన్నారు.