News January 22, 2025

ఏడాదిలో రూ.850 కోట్ల అభివృద్ధి: నిర్మల్ MLA

image

గడిచిన సంవత్సర కాలంలో నిర్మల్ నియోజకవర్గంలో రూ.850 కోట్ల మేర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నిర్మల్ మండలం వెంగ్వాపేట్, కౌట్ల, ముజ్గి తదితర గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.

Similar News

News February 24, 2026

జూడోలో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారుల విజయం

image

సీఎం కప్ 2025-26 జూడోలో ఆదిలాబాద్ క్రీడాకారుల విజయం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సీఎం కప్ రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన పతకాలు సాధించిన విజేతలను ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల శంకర్ సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జూడో క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

News February 24, 2026

ADB: 108 సిబ్బంది సేవలు అభినందనీయం

image

ఆపద సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది సేవలు అభినందనీయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా 108, 102 ఉత్తమ సేవల్లో హైలెట్ బెస్ట్ ఈఎంటీ, పైలట్ అవార్డులను మంగళవారం కలెక్టర్ అందజేశారు. ఈఎంటీ రేఖ, రాజేశ్వర్, పైలట్ శివకుమార్ ఈ అవార్డులను అందుకున్నారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, జిల్లా కోఆర్డినేటర్ శేఖర్, మనోహర్ వసీం పాల్గొన్నారు.

News February 24, 2026

ఆదిలాబాద్: ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరోడ్రమ్‌ ప్రాంతంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఎన్ని ఎకరాలు ఎక్కడి వరకు ఎన్ని భూములు వెళ్తున్నాయో మ్యాప్ ఆధారంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపళ్లి గంగాధర్ రావు, కనపర్తి చంద్రకాంత్, కౌన్సిలర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.