News March 24, 2024
ఏడుపాయలలో కనుల పండువగా దుర్గమ్మ పల్లకి సేవ
ఏడుపాయల వన దుర్గమ్మ సన్నిధిలో పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవ కనుల పండువగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆలయం నుండి ప్రారంభమైన పల్లకిసేవ శివాలయం మీదుగా కొనసాగి రాజగోపురం గుండా ఆలయం వరకు చేరుకోగా పల్లకి సేవలో పాల్గొని భక్తులు తరించిపోయారు.
Similar News
News November 15, 2024
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ చేస్తున్నారు: మెదక్ ఎంపీ
రాష్ట్రంలో పాలన పడకేసిందని, సీఎం రేవంత్ మాటలకు చేతలకు పొంతన లేదని ఎంపీ రఘునందన్ రావు విమర్శంచారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పులే సీఎం రేవంత్ చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ఖమ్మం మిర్చి యార్డులో రైతులను అరెస్టు చేసి బేడీలు వేసినప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో అరెస్టుల పర్వం కొనసాగించడం ఎంతవరకు సమంజసమని అన్నారు.
News November 14, 2024
ఏడుపాయలలో రేపు పల్లకీ సేవ, లక్ష దీపారాధన
మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత క్షేత్రంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ, లక్ష దీపారాధన, గంగా హారతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
News November 13, 2024
సిద్దిపేట: ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి
వరిధాన్యం కొనుగోలు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. హైదరాబాద్ సచివాలయం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లతో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలని, సామాజిక, ఆర్థిక, కుల గణనను పూర్తి చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనూచౌదరి, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.