News February 27, 2025

ఏడుపాయలలో తెలంగాణ జానపదుల సమ్మేళనం

image

ఏడుపాయల మహా జాతర అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడుతుంది. నెత్తిన బోనం, శివసత్తుల పూనకాలతో అమ్మవారి ప్రాంగణం వన దుర్గ మాత నామస్మరణతో పోరెత్తుతోంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారి మొక్కలు చెల్లించుకోవడానికి ముందుకు సాగుతున్నారు. బోనాలతో ప్రదర్శనగా వెళ్లి అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు.

Similar News

News November 26, 2025

మెదక్: రేపు స్థానిక సంస్థల పరిశీలకురాలు రాక

image

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ రేపు జిల్లాకు రానున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. ఆమె జిల్లా ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, అధికారుల సంసిద్ధతను సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకత, క్రమశిక్షణ కోసం అవసరమైన మార్గదర్శకాలు పరిశీలకులు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.

మెదక్ కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం

image

మెదక్ కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌ను డీపీఆర్ఓ రామచంద్రరాజుతో కలిసి జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై మీడియా సెంటర్ ద్వారా నిఘా పెట్టనున్నట్లు పేర్కొన్నారు.