News April 5, 2024

ఏడుపాయలలో నీట మునిగి వ్యక్తి మృతి

image

ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన భక్తుడు నీట మునిగి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాపన్నపేట ఎస్ఐ నరేశ్ వివరాల ప్రకారం.. HYD సంజీవరెడ్డి నగర్‌కు చెందిన వెంకటేశ్(28) బంధువులతో కలసి ఏడుపాయలకు వచ్చాడు. స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మంజీర పాయల్లో మునిగి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Similar News

News October 26, 2025

అమర వీరుల త్యాగాలు వృథా కావు: ఎస్పీ శ్రీనివాసరావు

image

పోలీస్ అమర వీరుల త్యాగాలు ఎప్పటికీ వృథా కావని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, సేవా కార్యక్రమాల్లో కూడా ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News October 25, 2025

‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పకడ్బందీగా పూర్తి చేయాలి’

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివిజన్ పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని దశలవారీగా, లోపాలకు తావు లేకుండా పూర్తి చేస్తామని వివరించారు.

News October 25, 2025

సొంత డబ్బులు రాక ఉద్యోగుల ఇబ్బందులు: టీఎన్జీవో

image

ప్రభుత్వం వద్ద తాము దాచుకున్న సొంత డబ్బులు రాక ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతున్నారని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక టీఎన్జీవో భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, ఐదు విడతల కరువు భత్యాన్ని విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు.