News November 14, 2024
ఏడుపాయలలో రేపు పల్లకీ సేవ, లక్ష దీపారాధన

మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత క్షేత్రంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ, లక్ష దీపారాధన, గంగా హారతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News December 1, 2025
ఎయిడ్స్పై జాగ్రత్తే కవచం: మంత్రి దామోదర్

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి దామోదర్ రాజనరసింహ పిలుపునిచ్చారు. ఎయిడ్స్పై అపోహలు వీడి, అవగాహన పెంపొందించాలని, సమయానికి పరీక్షలు, సురక్షిత జీవనశైలి మాత్రమే రక్షణ మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గోప్యతతో ఉచిత చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. వివక్షకు చోటు లేకుండా ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని మంత్రి ఆకాంక్షించారు.
News December 1, 2025
మెదక్: ఈరోజే మంచి రోజు.. అత్యధిక నామినేషన్లు

మెదక్ జిల్లాలో ఈరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. మెదక్, తూప్రాన్ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రేపటి వరకు అవకాశం ఉన్నప్పటికీ ఈరోజు ఏకాదశి, మంచి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో ద్వాదశి కారణంగా నామినేషన్ వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈరోజే అధికంగా నామినేషన్లు నమోదయ్యే అవకాశం ఉంది.
News December 1, 2025
మెదక్: ఏకగ్రీవం దిశగా మల్కాపూర్ తండా పంచాయతీ

మెదక్ మండలం మల్కాపూర్ తండాలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2019లో జరిగిన ఎన్నికల్లో సైతం ఏకగ్రీవం చేశారు. మొదటి సర్పంచ్ గా సరోజను ఎన్నుకున్నారు. ఈసారి దారావత్ బన్సీని ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది. గతంలో మల్లన్నగుట్ట తండా నుంచి సరోజ ఉండగా ఈసారి మల్కాపూర్ తండా నుంచి బన్సీ సర్పంచ్ కానున్నట్లు సమాచారం.


