News March 1, 2025

ఏడుపాయలలో విషాదం.. నదిలో మునిగి ఇద్దరు మృతి

image

మెదక్ జిల్లాలో ఏడుపాయల జాతర ముగింపు తర్వాత విషాదం నెలకొంది. పోతంశెట్టిపల్లి శివారులో 2వ బ్రిడ్జి వద్ద మంజీరా నదిలో మునిగి ఇద్దరు యువకులు చనిపోయారు. శనివారం స్నానం కోసం నలుగురు యువకులు దిగారు. ఇందులో కృష్ణ(20), షామా(21) ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు యువకులు బయటపడ్డారు. మృతదేహాలను మెదక్ ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ ఇందిరా నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Similar News

News October 15, 2025

జూబ్లీహిల్స్‌: సాదాసీదాగా సునీత నామినేషన్

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BRS అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ నామినేషన్‌ వేశారు. షేక్‌పేటలోని తహశీల్దార్‌ కార్యాలయంలో KTRతో కలిసి ఎలాంటి హడావుడి లేకుండా నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఆమె వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప‌ద్మారావుగౌడ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

News October 15, 2025

ఎన్నికల చిత్రం: అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు

image

ఎన్నికల వేళ పార్టీలు మారడం సహజమే. అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా నాయకులు కండువాలు మార్చేస్తున్నారు. మస్కటి డైరీ డైరెక్టర్ అలీ మస్కటి గత అసెంబ్లీ ఎన్నికల ముందు TDP నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి BRSలో చేరారు. అలాగే తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత నాని ఆ పార్టీని వదిలి నుంచి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

News October 15, 2025

ప్రముఖ సింగర్ బాలసరస్వతి కన్నుమూత

image

తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన రావు బాలసరస్వతి(97) తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1928లో జన్మించిన ఆమె ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. ‘సతీ అనసూయ’ చిత్రంలో తొలి పాట పాడారు. ఆరేళ్ల వయసు నుంచే పాడటం మొదలెట్టిన బాలసరస్వతి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో 2 వేలకు పైగా పాటలు ఆలపించారు. పలు సినిమాల్లో నటించారు.