News February 13, 2025
ఏడుపాయలలో వైభవంగా అమ్మవారి పల్లకి సేవ

ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత సన్నిధిలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి ప్రారంభమైన పల్లకిసేవ శివాలయం మీదుగా కొనసాగి రాజగోపురం గుండా ఆలయం వరకు చేరుకొని భక్తులు పల్లకిసేవలో పాల్గొని తరించిపోయారు.
Similar News
News November 7, 2025
స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO

ఇటీవల తుఫాను ధాటికి తిరుపతి జిల్లాలో స్కూళ్లకు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో కుమార్ వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
News November 7, 2025
తొర్రేడు: తండ్రిని హతమార్చిన తనయుడు

రాజమండ్రి మండలం తొర్రేడులో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. కూతురు వివాహం విషయంలో తండ్రి అప్పారావును కొడుకు వడిశెల సాయికుమార్ దారుణంగా హత్య చేశాడని రాజానగరం సీఐ వీరయ్య గౌడ్ గురువారం రాత్రి తెలిపారు. పెళ్లి విషయంలో చెల్లెలిని తండ్రి తిట్టడంతో కోపోద్రిక్తుడైన సాయికుమార్ కూరగాయలు కోసే కత్తితో అప్పారావు పీక కోసి హత్య చేసినట్లు వెల్లడించారు. సాయికుమార్ పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
News November 7, 2025
NEEPCOలో 98 పోస్టులకు అప్లై చేశారా?

NTPC అనుబంధ సంస్థ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


