News March 1, 2025
ఏడుపాయల జాతర ఆదాయం రూ.61.50 లక్షలు

మహా శివరాత్రి సందర్బంగా జరిగిన ఏడుపాయల మహా జాతర ఆదాయం (16 రోజులు) రూ.61.50 లక్షలు వచ్చింది. శనివారం హుండీ లెక్కింపు చేపట్టారు. ఆదాయం ఒడిబియ్యం 53,950, కేశఖండనంకు 68,150, స్పెషల్ దర్శనానికి రూ.9,00,800, లడ్డూ రూ. 18,74,580, పులిహోర రూ.7,96,480, హుండీ రూ.24,56,277 మొత్తం రూ.61,50,237 వచ్చిందన్నారు. గతేడాది కంటే ఈసారి రూ.32,051 అదనంగా ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు.
Similar News
News March 3, 2025
MDK: మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు.
News March 2, 2025
MDK: ఐఐటిహెచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

సంగారెడ్డి జిల్లా ఐఐటి హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఐఐటి విద్యార్థులు, అధ్యాపకులతో సంభాషించారు.
News March 2, 2025
మెదక్: మాజీ స్పీకర్ జయంతిలో పాల్గొన్న కలెక్టర్

మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతిని మెదక్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించారు. శ్రీపాద రావు చిత్రపటానికి కలెక్టర్ రాహుల్ రాజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం యువజన, క్రీడల అధికారి వై.దామోదర్ రెడ్డితో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా శ్రీపాద రావు ప్రజల కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.